జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 20వ సినిమా ‘ప్రిన్స్’ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా మూవీని తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ ప్రకటన వీడియో చాలా ఫన్నీగా ఉంది. అనుదీప్ తన స్టైల్‌లో సీరియస్‌గా ఉంటూ కామెడీ పండించాడు. మరియా అనే విదేశీ అమ్మాయి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
https://youtube.com/watch?v=GoA-0tHI_4k