ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి 2-0 వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ తమ మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఇక సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన యువ పేసర్ బుమ్రా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి స్వదేశంలో తొలి ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 29 మ్యాచ్‌ల కెరీర్లో ఎనిమిదోసారి ఈ ఘనతను సాధించి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. ఈ సందర్భంగా బుమ్రా క్రికెట ఆడే అన్ని ఖండాల్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో గ్రాహం మెకెంజీ, జాసన్ గిల్లెస్పీ, డేల్ స్టెయిన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ బౌలర్ అయ్యాడు.