నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదో రోజు విచారణ సుమారు 12 గంటల పాటు సాగింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు అయిదవ రోజు కూడా రాహుల్‌ను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5 రోజుల్లో 53 గంటల పాటు రాహుల్‌ను ఈడీ విచారించింది. మరో వైపు ఇదే కేసును ఎదురుకొంటున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈనెల 23న విచారణకు హాజారు కావాల్సి ఉన్నా.. కరోనా సోకడంతో కొద్దిరోజులు గడువు తీసుకున్న విషయం తెలిసిందే.