ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నేడు విడుదలైంది. అందరూ అనుకున్నట్లుగానే విడుదలైన అన్ని సెంటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు సైతం అనుకూలంగానే వస్తున్నాయి. ఇక, అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు. చొక్కాలు చింపుకొని మరీ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుతున్నారు. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడంతో.. ఆయన అభిమానులు కూడా అదే వేషధారణలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బైక్ లపై తరలివచ్చారు. ఈ వీడియోలను రామ్ చరణ్ యువశక్తి, చెర్రీ ఫ్యాన్ పేజీలలో అభిమానులు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
https://youtube.com/watch?v=Dew7QJDQjXU