భోజనం చేస్తూ ఓ వ్యక్తి దంతాన్ని మింగేయడంతో అతడి ప్రాణాల మీదకు వచ్చిన ఘటన బీహార్‌లో జరిగింది. బెగుసరాయ్‌కు చెందిన సురేంద్ర కుమార్.. గతంలో కృత్రిమ దంతం పెట్టించుకున్నాడు. అయితే అహారం భుజిస్తుండగా అది కొక్కెంతో సహా ఊడిపోయింది. సురేంద్ర కుమార్ దానిని అలాగే మింగేశాడు. అది గుండెకు, ఊపిరితిత్తులకు మధ్య ఇరుక్కోవడంతో అతడి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు అతి కఠినమైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడు.