ఈ ఏడాది పద్మభూషన్ అవార్డులు పొందిన వారిలో టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు ఈ అత్యన్నత పురస్కారం లభించింది. ‘మారథాన్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన చంద్రశేఖరన్ 1987లో టాటా కన్సల్టెన్సీ గ్రూప్‌లో ఇంటర్న్‌గా చేరారు. అప్పట్నుంచి అత్యున్నత స్థానాన్ని పొందేందుకు 30 ఏళ్లపాటు సంస్థతో కలిసి ప్రయాణించారు. అతని పర్యవేక్షణలో, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా విమానయాన రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చంద్రశేఖరన్ పర్యవేక్షణలో టాటా గ్రూప్‌లో సాధించిన అనేక విజయాలలో ఇది ఒకటి. అక్టోబర్ 2016లో ఆయన టాటా సన్స్ బోర్డులో చేరారు. జనవరి 2017లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు.