ఇటీవల పాలసీ బజార్ సంస్థ.. డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్న 4,500మందిపై సర్వే చేసింది. వీరిలో దాదాపు 20శాతం మంది సైబర్ నేరాల బారిన పడినట్లు తెలిపింది. దేశంలో నిత్యం 70కోట్ల మంది ఏదోఒకరకమైన డిజిటల్ ఆర్థిక సేవల్ని వినియోగిస్తున్నారు. ఈక్రమంలో సైబర్ దాడుల నుంచి రక్షణకు సైబర్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని సూచించింది. ఈ-కామర్స్, ఆన్ లైన్ చెల్లింపులు, ఇంటర్నెన్ బ్యాంకింగ్ ఎక్కువగా వాడేవారు ఈ బీమా తీసుకుంటే మంచిది. ఐసీఐసీఐ లంబార్డ్, HDFC ఎర్గో, ఎస్బీఐ ఈ తరహా ఇన్స్యూరెన్స్ అందిస్తోంది. ఈ బీమా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు భద్రతనిస్తుంది.
ఈ బీమాతో సైబర్ దాడుల నుంచి రక్షణ

© ANI Photo