ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి మూడు వారాలకు పైనే అయింది. బాంబులు, మిసైల్ దాడులతో చిన్న దేశం చిగురుటాకులా వణికిపోతోంది. సామాన్య పౌరులు సైతం కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. రష్యా ఎంతగా తీవ్రంగా ప్రయత్నించినా ఉక్రెయిన్ ప్రతిఘటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ మరొక వ్యూహం పన్నాడు. తాజాగా రష్యన్ ఆర్మీ నావికాదళ దాడులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు భారీ యుద్ద నౌకలు, క్షిపణులు, యుద్ద ట్యాంకులను మోహరించాయి. నల్ల సముద్రంలోని ఉత్తరం వైపున నౌకల కదలికలు ప్రారంభమయ్యాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు జపాన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.