చెన్నై, కోయంబత్తూర్లో పనిచేస్తున్నఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉమేంద్ర గత ఆదివారం ఫ్యామిలితో సహా సినిమా చూసేందుకు వెళ్లాడు. మూవీ చూశాక తిరిగి ఇంటికి వచ్చేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. థియేటర్ వద్దకు వచ్చిన ఓలా క్యాబ్ డ్రైవర్ ఓటీపీ చెప్పాలని అడిగాడు. అక్కడ ఓటీపీ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. అప్పటికే అతడి భార్య, పిల్లలు కారులో కూర్చున్నారు. వారిని కిందికి దిగాలని క్యాబ్ డ్రైవర్ తిట్టాడంతో ఉమేంద్ర కోపంతో కారు డోరును గట్టిగా తన్నాడు. దాంతో కోపంతో ఊగిపోయిన క్యాబ్ డ్రైవర్ ఉమేంద్ర ముఖంపై పిడుగుద్దులు కురిపించాడు. కాసేపటికే అతడు స్పృహతప్పి పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి ఆ డ్రైవర్ను విచారిస్తున్నారు.
ఓటీపీ వివాదం.. ఓలా డ్రైవర్ దాడిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

© Envato