పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనను సరిగ్గా కవర్ చేయనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాకిస్థాన్ టెలివిజన్ 17 మంది ఉద్యోగులకు సస్పెండ్ చేసింది. పర్యటన వీడియోలు, ఫొటోలను FTP(ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్) ద్వారా అప్లోడ్ చేయడానికి ఆధునాతన ల్యాప్టాప్ అందుబాటులో లేదు. దీంతో అద్దెకు తీసుకొచ్చిన ల్యాప్టాప్ బ్యాటరీ ఫెయిల్ అవ్వడంతో కవరేజ్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. దీంతో యాజమాన్యం ఉద్యోగులపై వేటు వేసింది.