కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ ఘనస్వాగతం పలికి నేరుగా గాంధీభవన్‌కు తీసుకువచ్చారు. అనంతరం సీనియర్ నేతలతో విడివిడిగా మాట్లాడనున్నారు. పొన్నాల, మధుయాష్కీ, భట్టి, ఉత్తమ్, రాజనర్సింహతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఫోన్ చేసి గాంధీభవన్‌కు రావాలని థాక్రే ఆహ్వానించారు. కానీ తాను గాంధీభవన్‌కు రానని కోమటిరెడ్డి తెగేసి చెప్పారు.