కుప్పంలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు

కుప్పంలో వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. కుప్పం ఇంచార్జీ, ఎమ్మెల్సీ భరత్‌ పీఏ అయిన మురుగేశ్‌ పరిస్థితి తీవ్రంగా గాయపడ్డారు. కొంత కాలంగా కుప్పంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం దాడికి దిగగా మురుగేశ్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికీ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

Exit mobile version