కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మన జీవితంలో మాస్క్ అనేది చాలా సాధారణమైన అంశంగా మారింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ కోవిడ్ బారిన పడకుండా ఉంటున్నారు. అయితే తైవాన్‌లోని మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పోరేషన్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద మాస్కును సృష్టించింది. దీనిని తమ మోటెక్స్ మాస్క్ క్రియేటివ్ హౌస్‌లో ఆవిష్కరించింది. దీని పొడువు 27అడుగుల 3 ఇంచులు, వెడల్పు 15 అడుగుల 9 ఇంచులు ఉంటుంది. ఇది సాధారణ మాస్కు కంటే 50 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ మాస్కు ప్రపంచంలోనే అతిపెద్ద మాస్క్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది.