తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. దాదాపు 11 వేలకు పైగా అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని భావించింది. ఈనెల రెండో వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఆలోచిస్తోంది. బీసీ గురుకులాల్లో 6,461, ఎస్సీ శాఖలో 2,267, గిరిజన శాఖలో 1,514, మైనారిటీశాఖలో 1,445 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.