పలు బ్యాంకులను కొల్లగొట్టిన హ్యాకర్లు మరో దోపిడీకి తెగబడ్డారు. తాజాగా Axie ఇన్ఫినిటీ NFT గేమింగ్ ఆధారిత బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ రోనిన్ నెట్వర్క్ నుంచి చోరీ చేశారు. 625 మిలియన్ డాలర్ల(రూ.4,750కోట్లు)ను కాజేశారు. ఈ క్రమంలో హ్యాకర్లు 1,73,600 Ethereum క్రిప్టోకరెన్సీని దొంగిలించారని తెలిసింది. ఈ ఘటన మార్చి 23, 2022న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే యాక్సీ ఇన్ఫినిటీ అనేది మనీ సంపాదించేందుకు ఆడే గేమ్. ఇది ప్లేయర్లు క్రిప్టోను సంపాదించేందుకు అనుమతిస్తుంది.