తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఐపీఎస్ అధికారిణి హాట్ టాపిక్‌గా మారారు. చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ అయిన రమ్య భారతి అర్దరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె ఆధీనంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఒంటరిగా సైకిల్ పై బయల్దేరి పెట్రోలింగ్ చేశారు. ఈ మేరకు రాత్రి 2.30 గంటల నుంచి 4 వరకు నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు, గార్డుల పనితీరును పర్యవేక్షించారు. దాదాపు 8 పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఆమె నైట్ డ్యూటీ ఉన్నవారంతా నిద్రపోకుండా పనిచేయాలని సూచించారు. కాగా, రమ్య భారతి పెట్రోలింగ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో షేర్ చేయడంతో అవి చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. దుబాయి పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఆ అధికారిని అభినందించారు.