ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ముంబయిలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కోల్ కతాను తక్కువ స్కోరుకే (128) ఆలౌట్ చేసింది. ఆ జట్టులో రస్సెల్ (18 బంతుల్లో 25) మినహా ఎవరూ రాణించలేదు. ఓపెనర్లు రహానే, వెంకటేష్ అయ్యర్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. బౌలింగ్ హసరంగ 20/4 తో విజృంభించాడు. ఆకాశ్ 3, హర్షల్ పటేల్ 2 వికెట్లు, సిరాజ్ 1వికెట్ పడగొట్టాడు.