భాగ్యనగర పరిధిలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న జీవో 111 ఎత్తివేసి ఈ అథారిటీని అందుబాటులోకి తీసుకురానుందట. ఈ విషయమై సీఎం కేసీఆర్ త్వరలో ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించనున్నారు. అలాగే ఈ జలాశయాల పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లను కూడ తొలగించేలా చర్యలు తీసుకోనున్నారట.