శ్రీకాకులం జిల్లా హిరమండలంలోని గొట్టబ్యారేజీ వద్ద విషాదం జరిగింది. తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు వెళ్లి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. వంశధార నదిలో స్నానం చేసేందుకు దిగి చనిపోయాడు. శుభలయ్య ఆర్ఆర్ కాలనీకి చెందిన లలిత్ సాగర్ తండ్రి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి కర్మకాండలు జరిపించేందుకు వెళ్లిన లిత్ నీటిలో దిగి గల్లంతయ్యాడు. మత్స్యకారులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
తండ్రి కర్మకాండలకు వెళ్లి కుమారుడు మృతి

© Envato(representational)