కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తుక్కుగూడలోని బహిరంగసభలో ప్రసంగించారు. బండి సంజయ్ యాత్ర కేవలం అధికార మార్పిడి కోసం కాదని ప్రకటించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విముక్తి కలిగించడం కోసమని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సెక్రటేరియట్ కు కూడా వెళ్లడం లేదని తెలిపాడు.