తెలంగాణ నుంచి ధాన్యం ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బియ్యం ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడి బియ్యానికి అపార అవకాశాలున్నాయన ఆయన ఎగుమతిదారులు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధాం ఇచ్చారు. ధాన్యం సేకరణ అనేది మద్దతు ధర, డిమాండ్ వంటి అనేక రకాల అంశాలపై ఉంటుందని పేర్కొన్నారు. కాగా, వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సీఎం కేంద్రంపై మండిపడిన సంగతి తెలిసిందే.