తెలంగాణ రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

© ANI Photo

తెలంగాణలోని 119 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల చివరిలోగా తమ ఆదాయ ఖర్చుల వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. నోటీసులపై స్పందించకపోతే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న పార్టీల్లో లోక్ సత్తా, తెలంగాణ జనసమితి, సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్, మనతెలంగాణ,తెలంగాణ తల్లి పార్టీలు ఉన్నాయి. మరోవైపు దేశంలో ప్రస్తుతం 8జాతీయ పార్టీలు, గుర్తుంపు పొందిన 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

Exit mobile version