తైవాన్ గగన తలంలోకి జే-11 యుద్ధ విమానాలు

© ANI Photo

అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలొసీ తమ దేశంలో పర్యటించడం చైనాకు ఆగ్రహం తెప్పించిందని తైవాన్ ప్రభుత్వం తెలిపింది.ఆమె పర్యటించిన రోజు 21 ఫైటర్ జెట్ల‌ను తమ గ‌గ‌న‌త‌లంలోకి చైనా పంపిందని పేర్కొంది. ఈరోజు ఏకంగా 27 చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించాయని ఆరోపించింది. వీటిలో అత్యాధునికమై జే 11 యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు వివరించింది. చైనా బెదిరింపులకు లొంగేదే లేదని తైవాన్ స్పష్టం చేసింది.

Exit mobile version