ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం అంటే ఈ నెల 25 వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు: రామకృష్ణ, సత్యప్రసాద్, అశోక్, రామరాజు. సభను పదేపదే అడ్డుకుంటున్నారని వీరి మీద స్పీకర్ సీతారాం వేటు వేశారు.