హైదరాబాద్ మన్నెగూడ కిడ్నాప్ కేసులో నిందితుడిపై బాధితురాలి తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె విషయంలో నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడని అన్నారు. ఆమెను సొంతం చేసుకోవటానికి ఎన్నో డ్రామాలు ఆడాడని పేర్కొన్నారు. తన కుమార్తెతో వివాహం జరిగిందని నమ్మించేందుకు కుట్రలు చేశాడని వెల్లడించారు. గతేడాది ఆగస్టు 27న ఓ వాహనం కొని భార్య స్థానంలో తన కుమార్తె పేరు రాశాడని..ఆ రోజు ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని తెలిపారు.