నేడు 200వ IPL మ్యాచ్ ఆడబోతున్న ఉతప్ప… ఊరిస్తున్న రికార్డులివే

Courtesy Instagram:chennaiipl

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప నేడు మంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడితే 200 IPL మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరతాడు. ఇప్పటికే సురేష్ రైనా, ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచులో ఉతప్పను పలు రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. అవేంటనేది **ఓ సారి లుక్కేస్తే.**

– ఇప్పటి వరకు 199 IPL మ్యాచులు ఆడిన ఉతప్ప 4,919 పరుగులు చేశాడు
– ఈ మ్యాచులో మరో 81 పరుగులు చేస్తే 5,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు
– మరో 47 పరుగులు చేస్తే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును అధిగమిస్తాడు
– IPLలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 7వ స్థానానికి చేరుకుంటాడు
– 5,000 పరుగుల మార్కును అందుకుంటే ఉతప్ప మరో రికార్డును కూడా తన పేర లిఖించుకుంటాడు
– ఈ 5,000 పరుగుల్లో ఉతప్ప ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు
– ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఉతప్ప 197 పరుగులు చేసి 2 అర్ధ సెంచరీలు బాదాడు.

Exit mobile version