హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లి సందడి మూవీ జూన్ 24 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. జనవరిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా, ఓటీటీ ఎంట్రీ కోసం అనేక మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు జీ5లో ప్రసారం చేయనున్నట్లు పెళ్లి సందడి చేయడానికి రెడీనా అంటూ ప్రకటించారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా యాక్ట్ చేశారు. మరోవైపు తండ్రి శ్రీకాంత్ చిత్రాన్ని రిమేక్ చేయడంతో సినిమాకు విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ దక్కింది. ఈ మూవీతో నటి శ్రీలీల మంచి ప్రశంసలు అందుకుంది.