ఒకే ఒక్క ఎకరాలో 70 టన్నుల టమాట పండించి ఓ రైతు అద్భుతం సృష్టించాడు. తెలంగాణలోని పర్వతగిరికి చెందిన నారెడ్ల సాంబయ్య ‘సాహొ’ పద్ధతిలో టమాటా సాగు చేస్తున్నాడు. ఈ పద్ధతి ద్వారా ఏటా రూ.లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ ఏడాది 70 టన్నుల టమాటా పండించాడు. ‘సాహొ’ పద్ధతి అంటే ఒక కర్రకు చెట్టును కట్టి పంట పండించడమే. ఈ పద్ధతికి ఎకరాకు రూ.2 లక్షలు ఖర్చవుతాయి. గోమూత్రం, గోపేడతో సేంద్రీయ పద్ధతిలో పంట పండించాలి.