బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

yousay

వరంగల్- వర్ధనపేట బాలికల గిరిజన ఆశ్రమ హస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. మొత్తం 40 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థినీలను చికిత్స నిమిత్తం MGM ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో మొత్తం 190 మంది విద్యార్థినిలు ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత అందరికీ ఒక్కసారిగా వాంతులు అయ్యాయి. వెంటనే సిబ్బంది వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భోజనంలో బల్లి పడిందని విద్యార్థులు చెబుతున్నారు. అందుకే అందరికీ వాంతులు అయ్యాయని పేర్కొన్నారు.

Exit mobile version