మహారాష్ట్ర మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ మంతనాలు మొదలయ్యాయి. సూరత్ లో 12 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటైంది. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుకు తెరలేపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహా అగాడీ కూటమి అప్రమత్తమైంది. మధ్యాహ్నం 2గంటలకు శరద్ పవార్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ క్రాస్ ఓటింగ్ కారణంగా 4 గెలవాల్సిన చోట 5 గెలిచింది. శివసేన, ఎన్ఎస్పీ 2 స్థానాలకు పరిమితమయ్యాయి.