మూవీ షూటింగ్‌లో హీరో గోపిచంద్‌కు గాయం?

గోపీచంద్ ప్ర‌స్తుతం ‘ల‌క్ష్యం 2’ సినిమాలో న‌టిస్తున్నాడు. ల‌క్ష్యం ద‌ర్శ‌కుడు శ్రీవాస్ దర్శ‌క‌త్వంలోనే ఈ మూవీ తెర‌కెక్కుతోంది. షూటింగ్ ప్ర‌స్తుతం మైసూర్‌లో జ‌రుగుతుంది. అయితే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో గోపిచంద్‌కు గాయాలు అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌డికి ఎలాంటి గాయాలు కాలేద‌ని, కాలు జారి కింద‌ప‌డిపోయాడ‌ని చిత్ర‌బృందం స్ప‌ష్టం చేసింది. డింపుల్ హ‌యాతి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మిక్కీ జే.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version