పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ప్రతిపక్ష నాయకులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన ఓటింగ్ కూడా జరగనుంది. అయితే గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు(PTI) ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్(MQM) పార్టీ మద్దతు ఇచ్చింది. తాజాగా ఆ మద్దతును రద్దు చేసుకొని ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయాడు. ప్రభుత్వ ఏర్పాటుకు 172 సీట్లు కావాల్సి ఉండగా.. ఇమ్రాన్ వద్ద 164 సీట్లు మాత్రమే ఉన్నాయి. అటు ఈ రోజు రాత్రి వరకు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.