తెలంగాణలో ప్రవేశపెట్టిన ట్రాఫిక్ చలానాల ఆఫర్‌కు విశేష స్పందన లభిస్తోంది. 15 రోజుల్లో 1.30 కోట్ల చలానాలు క్లియర్ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.130 కోట్లు జమ అయ్యాయి. వసూళ్లు అయిన చలాన్లలో 80 శాతం రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోవే కావడం గమనార్హం. ఆఫర్ ముగిసే లోపు మొత్తం రూ.300 కోట్లు వసూళ్లవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.