సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం తెరకెక్కించిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈనెల 12వ తేదీన విడుదలైన భారీ వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్తో వసూళ్ల సునామి సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. 2022లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి రీజినల్ మూవీగా SVP నిలిచింది.