దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికాలో ఫెడ్ రేట్ల పెంపు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో కూడా రెండో రోజు సూచీలు పైకి పరుగులు తీశాయి. దీంతో సెన్సెక్స్ 1047 పాయింట్లు పెరిగి 57,864 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 312 పాయింట్లు వృద్ధి చెంది 17,287 దగ్గర ముగిసింది. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా లాభపడగా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ సహా పలు షేర్లు నష్టాలను చవిచుశాయి.