ఆంధ్రప్రదేశ్ దువ్వాడలో రైలు, ప్లాట్‌ఫారం మధ్యలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన యువతి మృతిచెందింది. దాదాపు రెండుమూడు గంటలపాటు అల్లాడిపోయిన ఆమె..చికిత్స పొందుతూ చనిపోయింది. కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్లాట్‌ఫారం మధ్యలో పడిపోయింది. రైలు ఆమెను బలంగా కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలోనే ఆమె ప్రక్కటెముకలు విరిగిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఊపిరి తీసుకోవటంలో సమస్య ఏర్పడి మృతిచెందారని సమాచారం.