భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్రెండ్, భారత క్రికెటర్ కేదార్ జాదవ్ లేటు వయసులో రెచ్చిపోతున్నాడు. రంజీల్లో వరుస సెంచరీలు బాది ఔరా అనిపిస్తున్నాడు. 37 ఏళ్ల జాదవ్ మహరాష్ట్ర తరఫున అదరగొడుతున్నాడు. ఇటీవల అస్సాంతో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ (283)తో ఆకట్టుకున్నాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో (128) రాణించాడు. జట్టుకు అవసరమైనప్పుడు పరుగులు రాబడుతూ కీలకంగా మారుతున్నాడు. కాగా జాదవ్ ఐపీఎల్లో సీఎస్కేతరఫున ఆడాడు.