వారి మిసైల్స్‌కు తుపాకీతో జవాబిచ్చా: గులాం నబీ ఆజాద్

© ANI Photo

కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌..ఆ పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన సొంత పార్టీ నేతలే తనపై మిసైల్స్‌ వేశారని కానీ తాను తుపాకీతోనే వాటిని చిత్తు చేశానని ఆయన అన్నారు. తాను కూడా మిస్సైల్స్‌నే వాడుంటే వారు కనిపించకుండా పోయేవారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే 52 ఏళ్లు పార్టీతో ఉన్న అనుబంధం కారణంగా రాజీవ్‌ గాంధీని సోదరుడిగా, ఇందిరా గాంధీని తల్లిగా భావిస్తానని ఆజాద్‌ పేర్కొన్నారు. వారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు.

Exit mobile version