ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంతటి భారీ సక్సెస్ సాధించిందో తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలను సైతం కాదని ప్రేక్షకులు ఈ మూవీకి భారీ హిట్టును కట్టబెట్టారు. నెల క్రితం విడుదలయిన ఈ సినిమా యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో సిద్దు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ కోసం కొన్ని ఛానెల్లు వెంటబడ్డాయి. ఈ క్రమంలో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ సిద్దు ను ఇబ్బంది పెడుతూ అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగింది. దీంతో, యూట్యూబ్ లో నెటిజన్లు సదరు యాంకర్ ను ట్రోల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. సరదాగా ఉన్న ఆ వీడియోను మీరూ చూసేయండి.