మన దేశంలో హోలీ అంటే సందడి అంతా ఇంతా ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతిఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. స్వీట్స్ పంచుకుంటూ, రంగులు పూసుకుంటూ చిరునవ్వుల మధ్య, సంతోషంగా ఈ పండుగ రోజును గడుపుతారు. అయితే బీహార్ జిల్లాలోని ఓ వాటర్ పార్క్లో మాత్రం చెప్పులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. ఆ పార్కులోని ప్రజలందరూ తమ చెప్పులను ఇతరులపైకి విసురుకుంటూ హోలీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ హోలీ వేడుకపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.