కరోనాతో ఇప్పటికే జనాలు సతమతమవుతున్నారు. కోవిడ్ సోకి కోలుకున్నవారు సైతం అనేక రోగాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో డచ్ పరిశోధకులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మనిషి రక్తంలో తొలిసారి ప్లాస్టిక్ ను గుర్తించారట. ఇప్పటివరకు పదిమందిని పరీక్షించగా.. 8మందిలో ప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలిథిలీన్ టెరాఫ్తలేట్ (పీఈటీ), పాలిస్టిరీన్ ఉన్నట్లు తెలిపారు. వాటర్ ప్యాకెట్లు, డ్రింక్స్, ఆహారం ప్యాకేజీకి వాడే కవర్ల వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో వీటివల్ల దీర్ఘకాలిక రోగాలు, రక్తపోటు వచ్చే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.