కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ సినిమాకు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇంకా 250 రోజుల్లో రాబోతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న సినిమా… వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటుందని సమాచారం. అయితే కేజీఎఫ్ సినిమాలకు ఒక సంవత్సరం ముందుగానే టీజర్లు ఇచ్చిన ప్రశాంత్‌నీల్ ఈ సినిమాకు మాత్రం లేట్ ఎందుకు చేస్తున్నారంటూ ట్విట్టర్లో ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.