‘సీతారామం’లో కీల‌క పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాళిని ఠాకూర్ జంట‌గా న‌టిస్తున్న మూవీ ‘సీతా రామం’. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను వ‌దిలారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఇందులో బాలాజీ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మ‌రోవైపు ర‌ష్మిక‌, సుమంత్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. భారీ తారాగ‌ణంతో పాన్ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.

Exit mobile version