సెప్టెంబర్ 21న ప్రత్యేక దర్శనం టికెట్ల జారీ

Courtesy Twitter:TTD

నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి ఈ టికెట్లను జారీ చేస్తామని వెల్లడించింది.అక్టోబర్ నెలకు సంబంధించి పొర్లుదండాలు టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా ఈ నెల 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

Exit mobile version