ఓ 19 ఏళ్ల కుర్రాడు ఉత్తరప్రదేశ్ లోని నోయిడా రోడ్డులో అర్ధరాత్రి పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించుకుంది. స్ఫూర్తిదాయకంగా ఉన్న ఆ కుర్రాడి గురించి మీరూ తెలుసుకోండి. ఉత్తరాఖండ్ కు చెందిన ప్రదీప్ మెహ్రా అనే కుర్రాడు తన కలన నెరవేర్చుకునేందుకు అర్ధరాత్రి కిలోమీటర్ల తరబడి పరిగెత్తుతూ ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ కంట పడ్డాడు. వినోద్ ఆ కుర్రాడిని ఎందుకిలా పరుగెడుతున్నావ్.. లిఫ్ట్ ఇస్తానని అడుగుతాడు. దానికి ప్రదీప్ ఆర్మీలో జాయిన్ అవడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని.. కారులో ఎక్కితే ప్రాక్టీస్ మిస్ అవుతానని అంటాడు. ఉదయం ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడిగితే.. ప్రొద్దున్నే లేచి మళ్లీ పనికి వెళ్లాలని.. రాత్రి పూట అయితే కనీసం 10కి.మీ రన్నింగ్ ప్రాక్టీస్ అవుతందని అంటాడు. మంచాన పడిన తల్లి కోసం తెల్లారేసరికి మళ్లీ పనికి వెళ్లాలని చెప్తాడు ఆ కుర్రాడు. స్ఫూర్తిదాయకమైన ఆ వీడియోను మీరూ చూసేయండి.