– కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం.
– యూపీలోని 57 స్థానాలకు మొదలైన ఆరో విడత ఎన్నికలు.
– హోమియోపతి మేనేజ్మెంట్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ.
– ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా దూరంగా ఉన్న భారత్.
– 1847వ సంవత్సరంలో ఇదే రోజున టెలిఫోన్‌ను కనుగొన్న అలెగ్జాండర్ గ్రహంబెల్.
– డ్రైవర్ రహిత వాహనాలపై కెనడాలో కూడా టెస్టింగ్ ప్రారంభిస్తామన్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.
– తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.
– మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై నేడు తీర్పు చెప్పనున్న ఏపీ హై కోర్టు.
– నేడు భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్న ఆలయ అధికారులు.
– తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చిన బోర్డు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు సెకండియర్ పరీక్షలు.