04-04-2022 నేటి సినీ విశేషాలు

– బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించే సినిమాలో సమంతకు హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందంటూ టాక్
– గని సినిమా టికెట్ రేట్లను తగ్గించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. మల్టీప్లెక్స్‌లలో 200+జీఎస్టీ, సింగిల్ స్క్రీన్లలో 150+జీఎస్టీ వసూలు చేయాలని ఆదేశాలు జారీ
– హీరోయిన్ యామీ గౌతమ్ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్
– జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద త్రివిక్రమ్‌కు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో రూ. 700 జరిమానా విధించిన పోలీసులు
– ఏపీ, తెలంగాణల్లో ఆచార్య సినిమాను 1500 నుంచి 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మూవీ యూనిట్
– బీస్ట్‌లోని అరబిక్ కుతు సాంగ్‌ తెలుగు లిరికల్ వీడియో రిలీజ్
– మహేశ్ హీరోగా నటించిన సర్కారు వారి పాట వాయిదా పడుతుందంటూ ప్రచారం.

Exit mobile version