– నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ప్రకటించిన ఇంటర్ బోర్డు
– మినీ ట్రక్ లో EVని విడుదల చేసిన టాటా. ఇప్పటికే 39 వేల ఆర్డర్లు వచ్చాయని ప్రకటన. ఒక్కసారి చార్జ్ చేస్తే 154 కి.మీ ప్రయాణించవచ్చన్న కంపెనీ
– నేడు హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ. భారీగా ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ
– నేడు జలసౌధలో సమావేశం కానున్న KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు)
– ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన RRB పరీక్షల కోసం 65 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించిన రైల్వేశాఖ
– ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి బడులకు సెలవులు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
– నేడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ VS ముంబై ఇండియన్స్ పోరు
– నేటి నుంచి భాగ్యనగరంలో షురూ కానున్న సమ్మర్ ఉత్సవ్ మేళా.
– నేడు అంతర్జాతీయ డైట్ రహిత దినోత్సవం.