– నేడు షురూ కానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు
– మొదలైన ఉత్తరప్రదేశ్ మలి విడత (లాస్ట్ ఫేస్) పోలింగ్
– ఏపీలో కూడా నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
– NSE మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
– ఉక్రెయిన్ వెనక్కి తగ్గితేనే యుద్ధం ఆపేస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
– రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించిన TSRTC
– త్వరలో జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న స్టార్ బాక్సర్ మేరీ కోమ్
– ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగలో భాగంగా 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు ప్రకటించిన కేంద్రం