ప్రస్తుతం యువత ఫ్యాషన్ పేరుతో కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది. చిరిగిన పాంట్స్, చిరిగిన టీ షర్ట్ ధరిస్తూ ఫ్యాషన్ అని చెప్పుకుంటున్నారు. తాజాగా చెత్తకుప్పలో దొరికే బూట్స్‌ను తెగ లైక్ చేస్తున్నారట. ప్రముఖ ఫుట్‌వేర్ Balenciaga కొత్త షూ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘పారిస్ స్నీకర్’ అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ షూస్ పూర్తిగా చెత్తకుప్పలో దొరికినట్లు ఉన్నాయి. చిరిగిపోయిన, పాత పడిపోయిన ఈ షూస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కనీస ధర రూ.38,208ల నుంచి రూ.48,243 వరకు ఉండగా.. అధికంగా చిరిగిన షూకు దాదాపు ఒక లక్ష 43 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.